నట్టల నివారణ మందు వేయించాలి

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో బుధవారం పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీమల రాజు యాదవ్ మాట్లాడుతూ, జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు వేయించాలని సూచించారు. గొర్రెలు, మేకల కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర చెరుకుపల్లి సత్యనారాయణ, గుండాల గోవింద్, బూడిద జంగయ్య, పాసు యాదయ్య, పాసు కృష్ణ, ఈరటి శివ, ఈరటి రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్