కొండమల్లేపల్లి మండలంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, మండల విద్యాధికారి ఆర్. నాగేశ్వరరావు దివ్యాంగుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహం, హక్కుల రక్షణ, సమాన అవకాశాల కల్పన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వైకల్యాలతో జీవించే వ్యక్తుల ఎదుగుదల, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు, అందరికీ మధ్యాహ్న భోజనం అందించారు.