దేవరకొండ పట్టణ శివారులోని తాటికోల్ రోడ్డు భాగ్యనగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆత్మహత్యా? హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.