చందంపేట: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. చందంపేట మండలంలో శుక్రవారంతో రెవెన్యూ సదస్సుల్లో ముగియగా మొత్తం 1484 దరఖాస్తులు వచ్చినట్టు తహశీల్దార్ తెలిపారు.