చందంపేట: మండల పరిధిలోని పెద్దముల గ్రామంలో సోమవారం కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి చెందగా, మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. మృతి చెందిన గొర్రెల విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని గొర్రెల యజమాని అంజయ్య యాదవ్ కోరారు.