చందంపేట: ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరస్తులను గుర్తించడంలో నేరాలను నివారించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ మౌనిక అన్నారు. బుధవారం పోలేపల్లి ఎక్స్ రోడ్ వద్ద దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఏడు సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ బీసన్న, ఎస్సై లోకేష్, పార్వతి పుత్ర హెల్పింగ్ హ్యాండ్స్ హరీష్ చారి, రవీందర్ రెడ్డి, నరేష్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.