చింతపల్లి మండలంలో మూసివేసిన పాఠశాలలను తెరిపించడం టీపీయూఎస్ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా టీపీయూఎస్ పని చేస్తుందని మండల అధ్యక్షులు గురువారం పేర్కొన్నారు. పీఆర్టీయూ మాజీ అధ్యక్షులు గోలి సుధీర్, జగరాం సభ్యత్వము తీసుకొని టీపీయూఎస్ లో చేరడం జరిగింది. సభ్యత్వ నమోదులో మండల అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి కిరణ్, జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.