చింతపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంతకుడు తండా శివారులో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రెండు మోటార్ సైకిల్, నాలుగు సెల్ ఫోన్లు, 2000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్