దేవరకొండ: మండల పరిధిలోని కాసారంలో మాజీ సర్పంచ్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పెద్దమ్మ అనే మహిళా చనిపోయిందంటూ ఆమె పేరిట ఉన్న పట్టా భూమిని అక్రమంగా పౌతి కోసం మాజీ సర్పంచ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్ఐ విచారణలో విషయం వెలుగులోకి రావడంతో మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు సోమవారం తహశీల్దార్ కు ఫిర్యాదు చేసింది.