దేవరకొండ: విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలి

దేవరకొండ: బడ్జెట్ లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఎబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్ కృష్ణ, అమితేష్, ఈశ్వర్, సైదులు పాల్గొన్నారు. ‎

సంబంధిత పోస్ట్