దేవరకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన తరువాత బిల్లు ఆమోదం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆర్డినెన్స్ తో ఉపయోగం లేదన్నారు.