విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చీన్యా అన్నారు. బుధవారం ఆయన పడమటిపల్లి కాంప్లెక్స్ పరిధిలోని కర్నాటపల్లి, జిల్లాపల్లి, ఎల్లారెడ్డి బావి ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల నోటుబుక్స్, వర్క్ బుక్స్, ఉపాధ్యాయ విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన తీరును గమనించి పలు సూచనలు చేశారు.