నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బాలు నాయక్ ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మారిన పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య పంటలను సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.