కొద్ది నెలలక్రితం ఆమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్న క్రమంలో ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన కాచారాజుపల్లికి చెందిన బద్దెల అంజయ్యకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఆర్థిక సహాయం చేశారు. కంటి ఆపరేషన్ కోసం కిషన్ నాయక్ ను బాధితుడు ఆశ్రయించగా గురువారం హైదరాబాద్ లో 30 వేల రూపాయలను అందజేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.