దేవరకొండ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఘనంగా ప్రగతి చక్ర అవార్డుల ప్రథానోత్సవం జరిగింది. డిపోలో ఉత్తమ సేవలందించిన పలువురు ఉద్యోగులను డిపో మేనేజర్ రమేష్ బాబు సత్కరించి ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లు, టిమ్ డ్రైవర్లు, మెకానిక్స్, శ్రమిక్ లకు ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు. అనంతరం విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల పిల్లలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సైదులు, ఉద్యోగులు పాల్గొన్నారు.