దేవరకొండ: ప్రజా సమస్యలు పరిష్కరించాలి

దేవరకొండ: ప్రభుత్వం గతంలో పేదల ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని వెంటనే అర్హులైన వారికి పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. సీపీఎం ప్రజాపోరులో అనేక సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, లింగయ్య, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్