దేవరకొండ: సీనియర్ అడ్వకేట్ రామారావు మృతి

దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ వివి రామారావు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో అకాల మరణం చెందారు. ఈ ప్రాంతంలో న్యాయవాదిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. రామారావు మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా ఆయన అంత్యక్రియలు గీతా నగర్ కాలనీ నాగోల్ లో శనివారం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్