నల్లగొండ జిల్లా సిపిఐ డిండి మండల ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన అఖిల భారత యువజన సమాఖ్య మండల సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతను చైతన్య పరచాలని, గ్రామాల్లో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తుందని దానికి యువత బలి కావద్దన్నారు. యువకులను చైతన్య పరిచి డ్రక్స్ ను తరిమివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో AIYF డిండి మండల అధ్యక్ష కార్యదర్శులు నరేష్, మహేష్, కోశాధికారి మధుకర్, MD ఆదిల్, ప్రవీణ్, గోవర్ధన్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.