డిండి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం వాహన తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో తరలిస్తున్న 420 కేజీల నల్లబెల్లం, 100 కేజీల పటిక పట్టుకుని, ఉప్పునుంతలకు చెందిన ఆటో డ్రైవర్ సురేందర్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.