డిండి: మండలపరిధిలోని నగారా దుబ్బతండాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్దు(13) అనే విద్యార్థి స్నేహితులతో కలిసి గ్రామ సరిహద్దుల్లో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ మేరకు మృతుడి తండ్రి చంద్రు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు.