నల్గొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కల్వకుర్తికి చెందిన అరవింద్, కార్తీక్ లుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.