నేరేడుగొమ్ము మండలం బుగ్గ తండా గ్రామపంచాయతీలో బుధవారం ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సలహాదారు రఘు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ప్రాధాన్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. బ్యాంకింగ్ సేవలపై కూడా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు.