బీఆర్ఎస్‌లోకి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి దేవరకొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేతావత్ మంజ్య నాయక్, కేతావత్ రూప్ల, భవానీ శ్రీధర్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి రవీంద్రకుమార్‌ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్