దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం హరిజనాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణ, ఉపసర్పంచ్ కంబాలపల్లి లక్ష్మయ్య, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ పథకం టీఏ సార్, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలను స్మరించుకుంటూ, గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.