దేవరకొండ నియోజకవర్గంలోని హరిజనాపురం గ్రామంలో మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక వినాయక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. కమిటీ సభ్యులు ముస్కు అంజి, వారి కుటుంబ సభ్యులు వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పూజారి ఏపూరి పెంటయ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.