గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న అన్నారు. తీదేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో VB–G RAM–Gపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న మాట్లాడుతూ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులపై గ్రామస్థులతో చర్చించారు. తీదేడు గ్రామ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యమని గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామన్నారు.