గుర్రంపోడు మండలంలో ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్ (18) డీజె సిస్టం ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.