నల్లగొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణ నర్సిరెడ్డి, చిట్టిపోలు నాగార్జున కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఫిబ్రవరి 04న జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ఎన్నికల సమన్వయకర్త తిప్పన విజయ సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, సాదం సంపత్ కుమార్ లు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.