'ఉపాధి' పనులపై కొనసాగుతున్న ఓపెన్ ఫోరం

చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 కోట్లతో చేపట్టిన ఉపాధి హామీ పనులపై శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో బహిరంగ వేదిక నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చందంపేట మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో చేపట్టిన ఈ పనులపై గత వారం రోజులుగా సోషల్ ఆడిట్ బృందం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా పనుల పురోగతి, ఖర్చుల వివరాలను అధికారులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్