బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసిందని విమర్శించారు. 'రైతు గోస. బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, తరుగు పేరుతో బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.