ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించిన సూపర్వైజర్ ప్రసన్న

దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం ముర్పునూతల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రసన్న గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించారు. పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. ముర్రుపాలు తల్లి తన బిడ్డకు ఇచ్చే మొదటి, విలువైన బహుమతి అని ఆమె పేర్కొన్నారు. తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్