పొలగోని రాములమ్మ మృతి బాధాకరం

చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన పొలగోని రాములమ్మ మృతి పట్ల తీదేడు గ్రామ ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాములమ్మ మృతి ఎంతో బాధాకరమని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ధరణిపతి రమణారావు, బొడ్డు ఆంజనేయులు, కలగోని రాజుగౌడ్, శ్రీను దాసరి, రాసిక హరీష్, నేలపట్ల అనిల్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕