పాత పద్ధతి లో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలి

పాత పద్ధతి లో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 100, 500 కోట్ల స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఆర్డీవో కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఆర్డీవో పి పద్మప్రియ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను స్కాలర్షిప్ 10, 500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్