మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మద్ది మడుగు సైదులుతో పాటు సుమారు 120 కుటుంబాలు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.