కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మమ్మకు నివాళి

నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణవెళ్లెంలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శిరసనవాడ వెంకన్న తల్లి శిరసనవాడ లక్ష్మమ్మ ఇటీవల వృద్ధాప్యంతో మరణించారు. ఆదివారం ఆమె దశదినకర్మ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య పాల్గొని, లక్ష్మమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణవెళ్లెంల ఉపసర్పంచ్ నల్లబోతు సత్తయ్య, వార్డ్ మెంబర్ బొడిగే స్వామి తదితరులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్