హరిజనాపురంలో వినాయక పూజలు, అన్నదానం ఘనంగా

దేవరకొండ నియోజకవర్గం, హరిజనాపురం గ్రామంలో మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ తంగేళ్ళ రామకృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు, అన్నదానంబుధవారం నిర్వహించారు. పూజారి ఏపూరి పెంటయ్య వేద మంత్రోచ్చారణలతో పూజలు చేయగా, అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామూర్తి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕