వినాయకుని సన్నిధిలో పూజలు.. భక్తులకు అన్నప్రసాదం

నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలోని హరిజనాపురంలో బుధవారం మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ తంగేళ్ళ రామకృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. పూజారి ఏపూరి పెంటయ్య వేద మంత్రోచ్చారణలతో పూజలు చేయగా, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామూర్తి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕