మేత కోసం వెళ్లిన పశువులను తోలుకోవచ్చేందుకు వెళ్లిన సురుగాని అయోధ్య (20) అనే యువకుడు నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషాద ఘటన చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం పశువులను తోలుకు వచ్చేందుకు కృష్ణా నది వైపు వెళ్లిన అయోధ్య ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నది వద్దకు వెళ్లగా అక్కడ అతని చెప్పులను గుర్తించారు. నదిలో గల్లంతై ఉంటాడని గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం అతని మృతదేహం నదిలో లభ్యమైంది.