కోదాడలోని శ్రీనివాస్ నగర్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈశ్వర్ అనే యువకుడు బైపాస్ నుండి రోడ్డు క్రాస్ చేసి కోదాడ వైపు వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈశ్వర్ కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈశ్వర్ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.