కోదాడ: పందెం కోడి పుంజుకు శస్త్ర చికిత్స

కోదాడ పరిధిలోని శ్రీరంగాపురంలో శనివారం కుక్కల దాడిలో పందెం కోడిపుంజు మెడ విరిగి తీవ్రంగా గాయపడింది. గమనించిన యజమాని కోదాడ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తీసుకురాగా డాక్టర్ పెంటయ్య మెడ ఎముకకు జత చేసి కట్టు కట్టి కోడిపుంజు ప్రాణాలను కాపాడారు. వినూత్న రీతిలో జంతువులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ పెంటయ్యను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్