వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయని సూర్యాపేట డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ అన్నారు. ఆదివారం మునగాలలో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ, గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి కాపాడాలని కోరారు.