కోదాడ: ఫ్యాన్‌కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. మృతురాలు కలకోవకు చెందిన తనుజగా గుర్తించారు. సోమవారం సాయంత్రం మృతురాలు తనుజను చూడటానికి తండ్రి వచ్చి వెళ్లినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్