మోతే మండలం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్ తండ్రి శీలం లింగయ్య యాదవ్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గం నాయకులు పచ్చిపాల వేణు యాదవ్ అన్నారు. గురువారం మోతే మండలం నరసింహపురం గ్రామంలో లింగయ్య మృత దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ లింగయ్య మృతి గ్రామాభివృద్ధికి తీరని లోటు అన్నారు.