అనంతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శని వారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.