నల్లగొండ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా అనంతా చారి

నల్గొండ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నారబత్తుల అనంతాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి ఈ విషయాన్ని తెలిపారు. అనంతాచారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి వార్డు మెంబర్‌కు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని, వార్డు మెంబర్ల గౌరవ వేతనం కోసం ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్