నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డులో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతుర్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. తల్లి రాజేశ్వరి , కూతురు (వేద సాయి శ్రీ ) గా పోలీసులు గుర్తించారు. వీరి స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం కు చెందిన వారీగా గుర్తించారు. భర్త జి. సీతారాం రెడ్డి ఉద్యోగరీత్య మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఘటన స్థలం కు చేరుకొని విచారణ జరుపుతున్నారు.