బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ మీర్యాలగూడలో మాట్లాడుతూ, జనగణనలో బీసీలను లెక్కించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అస్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అందులో ఎస్సీ, ఎస్టీల గురించి అడుగుతూ బీసీల గురించి అడగలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష వైఖరి సరికాదని ఆయన అన్నారు.