కేంద్ర ప్రభుత్వ విధానాలు పేదల కడుపుకొట్టేలా ఉన్నాయని, వాటిని ఉద్యమాలతో తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు వీబీ జీ రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు.