తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు 2025_25 సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని శుక్రవారం వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్, సహాయ కో ఆర్డినేటర్లు సైదిరెడ్డి, దశరథ్ నాయక్ గురువారం తెలిపారు. చదువు మధ్యలో మానివేసిన వారికి ఇది వరమని వెంటనే అడ్మిషన్లు తీసుకొని కోర్సులు పూర్తి చేసుకోవాలని సూచించారు.