గణేష్ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ

దామరచర్ల మండలం జైత్రం తండాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, ఆటపాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీటీసీ ఆడడావుత్ వాలి హాంజీ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యువత భక్తితో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕